![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1066 లో..... ఎందుకు తాగి ఆ లక్కీగాడితో మన పెళ్లి అబద్ధమని చెప్పావ్ .. ఇప్పుడు గనుక నందు రాకపోయి ఉంటే ఏమై ఉండేదని రాజుపై ఇందు గొడవపడుతుంది. అప్పుడే అపర్ణ వస్తుంది. ఎందుకు అలా గొడవ పడుతున్నారని అడుగుతుంది. ఏం లేదు అమ్మమ్మా అని రాజు కవర్ చేస్తారు. మేం భార్యాభర్తలం కదా ఇలాగే ఉంటామని ఇందు భుజంపై రాజు చెయ్ వేస్తాడు. చూసారా నేను చెయ్ వేసినా ఏం అనట్లేదని రాజు అంటాడు.
మరొకవైపు అసలు ఇందు, రాజు ఆ దుగ్గిరాల ఇంట్లో ఎందుకున్నారు.. రాజు గురించి ఆ రేఖకి తెలిస్తే వాడిని బ్రతకనియ్యదు చాలా భయంగా ఉందని లక్ష్మి, చలపతి అనుకుంటారు. ఆ తర్వాత లక్కీని రాజు కలిసి.. అసలు నువ్వు నా ఫ్రెండ్ వేనా నా విషయలన్నీ నీకు చెప్పుకుంటే.. ఆ ఐశ్వర్యతో చేతులు కలిపి ఇలా చేస్తావా. అది వీడియో తీసి పార్టీ లో ప్లే చేసిందని లక్కీపై రాజు కోప్పడతాడు. ఒరేయ్ నాకు నిజంగా తెలియదురా ఏదో ప్రేమగా మాట్లాడిందని అలా చేసానని లక్కీ కవర్ చేస్తాడు.
ఆ తర్వాత లక్కీని ఐశ్వర్య కలిసి మాట్లాడుతుంది. నువ్వు నాకొక హెల్ప్ చెయ్యాలి. అసలు రాజు ఇందు భార్యభర్తలు కాదన్న విషయం ఇంటికి వచ్చి చెప్పాలని ఐశ్వర్య అనగానే నువ్వు ఏం చెయ్యమన్నా చేస్తాను కానీ ఈ హెల్ప్ చెయ్యలేనని లక్కీ వెళ్ళిపోతాడు. ఎలాగైనా ఇంట్లో వాళ్ళకి సాక్ష్యంతో నిరూపించాలని ఐశ్వర్య అనుకుంటుంది. మరొకవైపు ఈ రోజు క్లయింట్ తో అగ్రిమెంట్ ఉందని రేఖ రెడీ అవుతుంది. క్లయింట్ మొదటి చెక్ ఇవ్వగానే ఇందు తీసుకొని వచ్చి నాకు ఇస్తుందని రేఖ అనగానే అంత లేదు.. ఆ రాజు గాడు ఉండగా అది జరగదని భ్రమరాంబ అంటుంటే అసలు మంచిగా మాట్లాడరా అని రేఖ కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |